Free Electricity for Ganesh Pandals
ఆకేరు న్యూస్,కమలాపూర్ :
రాబోయే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని కమలాపూర్ మండల బీజేపీ అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ వీడియోను విడుదల చేశారు.
వాడవాడలా, ప్రతి ఇంటిలోనూ వినాయక చవితి ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తారని తెలిపారు. అయితే, గత సంవత్సరం గణేష్ మండపాల నిర్వాహకులపై కరెంటు బిల్లుల భారం మోపడం జరిగిందని ఆయన గుర్తుచేశారు.
ఈ ఏడాది భక్తుల మనోభావాలు, సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉత్సవాలు జరిగే అన్ని గణేష్ మండపాల వద్ద ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకుండా ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
