IAS Sandeep Sultania
* సందీప్ సుల్తానియాపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
* ఆయనపై వెయ్యి కేసులున్నాయి..
* ప్రభుత్వ తప్పులకు అధికారులకు ఈ దుస్థితని వ్యాఖ్య
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఐఏఎస్ సీనియర్ అధికారి, తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనపై దాదాపు వెయ్యి కేసులు ఉన్నాయని, అవన్నీ న్యాయస్థానంలో విచారణ జరిపితే జీవితకాలం జైల్లో ఉండాల్సి వస్తుందని పేర్కొంది. అలాగే ప్రభుత్వం చేస్తున్న తప్పులకు అధికారులకు ఈ పరిస్థితి వస్తోందని కూడా న్యాయస్థానం పేర్కొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత జే రామకృష్ణ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిన్న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సందీప్ సుల్తానియా ఈరోజు వ్యక్తిగతం కోర్టుకు హాజరయ్యారు. తప్పని పరిస్థితుల్లో అధికారులను కోర్టుకు పిలవాల్సి వస్తోందని న్యాయస్థానం ఈ సందర్భంగా పేర్కొంది. ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా నేరుగా కోర్టు ముందు హాజరై వివరణ ఇచ్చారు.
* ఆయనను ఎక్కడుంటే అక్కడ అరెస్ట్ చేయండి!
ఇదే కేసులో నిన్న హైకోర్టు సందీప్ సుల్తానియాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కంటోన్మెంట్ బోర్డుకు బకాయిల విడుదలపై కోర్టు ఆదేశాలను ధిక్కరించడంతో సీరియస్ అయ్యింది. సందీప్ సుల్తానియా ఎక్కడ కనిపిస్తే అక్కడ అరెస్టు చేసి హాజరుపరచాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను నిన్న ఆదేశించింది. శుక్రవారం కచ్చితంగా కోర్టుకు హాజరవుతానని పేర్కొంటే రూ.5000 పూచికత్తుతో బెయిల్‌పై విడుదల చేయవచ్చని ఊరటనిచ్చింది. దీంతో పోలీసులు ఐఏఎస్‌ను అదుపులోకి తీసుకుని, రూ.5000 పూచికత్తుతో బెయిల్‌పై హైదరాబాద్ సీపీ విడుదల చేశారు. ఈ మేరకు ఆ వివరాలను సీపీ ఈరోజు కోర్టుకు సమర్పించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
