Dhurandhar OTT Record
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సైలెంట్ గా వచ్చి ఓవరాల్ ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద వైలెంట్( రికార్డులు ) క్రియెట్ చేసింది దురంధర్. స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా రికార్డులను సృష్టించింది. ధురందర్ 1, ధురంధర్ 2 ఈ రెండు కూడా మూడు నెలల వ్యవధిలో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్’ కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.
* ఓటీటీలోనూ దండయాత్రే
నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ధురందర్ మూవీని చూశారని నెట్ఫ్లిక్స్ కో-సీఈవో టెడ్ సరాండోస్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ సినిమా ఏకంగా 3.7 కోట్ల (37 మిలియన్ల) వ్యూస్ సాధించిందన్నారు.
* దర్మకుడు ఆదిత్యధర్.. ప్రధాన చిత్రాలు
ఉరి -ది సర్జికల్ స్ర్టైక్ (2019), ఆర్టికల్ 370 (2024 నిర్మాతగా), ధురంధర్ (2025), ధురంధర్: ది రివెంజ్ (2026) చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ‘ఉరి’ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నారు.
* ధురంధర్ వసూళ్లు..
ధురంధర్ (పార్ట్ 1) 2025 డిసెంబర్లో విడుదలైన ఈ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,350 కోట్ల నుంచి రూ. 1,428 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. భారత్లో దీని నెట్ వసూళ్లు దాదాపు రూ. 840 కోట్లుగా నమోదయ్యాయి.ధురంధర్: ది రివెంజ్ (పార్ట్ 2): 2026 మార్చిలో విడుదలైన ఈ సీక్వెల్ మొదటి భాగం రికార్డులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా రూ. 1,850 కోట్లకు పైగా వసూలు చేసింది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
