Hasanparthy Train Stoppage
* తెగిపడిన విద్యుత్ తీగలు
ఆకేరు న్యూస్, హనుమకొండ: హసన్పర్తి రైల్వే స్టేషన్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఫ్లైఓవర్ వద్ద రైలు ప్రమాదం తృప్తిలో తప్పి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగ్పూర్ నుండి కాజీపేట వైపు వస్తున్న నాగ్పూర్–కాజీపేట ఎక్స్ప్రెస్ రైలు మార్గమధ్యంలో విద్యుత్ సరఫరా చేసే ఓవర్ హెడ్ వైర్లు (OHE) అకస్మాత్తుగా తెగిపోవడంతో అక్కడికక్కడే నిలిచిపోయింది.
విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సాంకేతిక శాఖ అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు.
* ప్రయాణికుల తీవ్ర అవస్థలు..
ఈ ఒక్క నెలలోనే ఇదే మార్గంలో రైళ్లు నిలిచిపోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. వరుసగా సాంకేతిక సమస్యలు, విద్యుత్ తీగలు తెగిపడటం వంటి సంఘటనలు జరుగుతుండటంతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన, అసౌకర్యం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి రైలు నిలిచిపోవడంతో వేడి, ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోయారు. మరమ్మతులు వేగవంతం చేసి, త్వరలోనే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
