Uttarakhand Road Accident, One person was injured.
ఆకేరు న్యూస్, డెస్క్: తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవప్రయాగ్-పౌరీ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల్లో ఓ మహిళతో పాటు మూడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. వారు ఏదో కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. వాహనం అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుడికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
