Malla Reddy’s Daughter-in-Law Preethi Reddy’s Dance Goes Viral
* బోనాల జోష్ పెంచిన ప్రీతిరెడ్డి
* భక్తిపారవశ్యంతో ఊగుతున్న నగరం
* పాటలు, నృత్యాలతో సందడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భక్తిప్రపత్తులతో బోనాలు సమర్పిస్తూ.. అమ్మను పూజిస్తూ.. ఆనందంతో నృత్యాలు చేస్తున్నారు. బోనాలతో తరలివచ్చిన కొందరు మహిళలు సైతం అమ్మవారి పూజ అనంతరం అక్కడి వాతావరణం, పాటలకు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా అందరూ అమ్మ ముందు ఆడిపాడుతున్నారు. ఇదే క్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్పర్సన్, మల్లారెడ్డి హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల నిర్వాహణ చూస్తున్న మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి చేసిన నృత్యం వైరల్గా మారింది.
* జోష్ నింపిన ప్రీతిరెడ్డి
పాతబస్తీ మీరాలం మండీ మహంకాళేశ్వర ఆలయంలో బోనాల సందడి అంబరాన్నంటింది. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఆలయాన్నిసందర్శించారు. అంతేకాదు.. డ్యాన్స్ చేసి అక్కడున్న వారిలో జోష్ పెంచారు. పీతిరెడ్డి నృత్యం చేయడంతో మిగిలిన మహిళలు, భక్దులు కూడా పాదం కలిపారు. సంతోషంగా నృత్యం చేస్తూ ఆకట్టుకున్నారు. పీతిరెడ్డి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె చూపిన ఉత్సాహానికి అక్కడి వాతావరణం అంతా సందడిగా మారిపోయింది. అదే ఆలయాన్ని నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల రెండో రోజుల క్రితం సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు.
* బోనమెత్తిన జీహెచ్ఎంసీ కమిషనర్ సతీమణి
బోనాల నేపథ్యంలో ప్రముఖులు సైతం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. భక్తిశ్రద్దలతో బోనం ఎత్తుకుని ఆలయానికి నడిచి బోనం సమర్పిస్తున్నారు. ఇదే క్రమంలో మేకలబండ నల్ల పోచమ్మ అమ్మవారికి జీహెచ్ఎంసీ గ్రేటర్ కమిషనర్ ఆర్.వి కర్ణన్ సతీమణి, నారాయణ్ పేట్ కలెక్టర్ ప్రియాంక బంగారు బోనం సమర్పించారు. ఇంటి నుంచి బోనం ఎత్తుకుని వచ్చి అమ్మవారికి బోనం అందజేశారు. భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
View this post on Instagram

Please tell us what is wrong. Your report will be sent to the website team.
