Mallanna Gandi Tourist Spot
* పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ జిట్టగూడెం, చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా శివారులోని ‘మల్లన్న గండి’ రిజర్వాయర్ జలకలతో ఉట్టిపడుతుండగా సందర్శకుల తాకిడితో పర్యాటక కేంద్రంగా తలపిస్తున్నది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా మల్లన్న గండి రిజర్వాయర్ లోకి పంపింగ్ ద్వారా నీటిని నింపుతున్నారు. ఎడమ తూము నుండి కిందికి వచ్చే నీరు బొగత జలపాతాన్ని తలపిస్తుంది. దీంతో మల్లన్న గండి రిజర్వాయర్ ను తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని స్నానాలు చేస్తూ, ఆనందోత్సా హాలతో సంబరపడుతున్నారు. బోగత జలపాతంలా పై నుండి నీరు కిందికి తెల్లటి పాలలా వస్తుండ డంతో పర్యాటకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నా రు. చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తయిన కొండలు, రిజర్వాయర్ లో నీరు, పాలనురుగు లాంటి జలపాతం చూసి అక్కడికి వెళ్లిన ప్రజలు వెంటనే తిరిగి వెళ్లలేక చాలా సమయం అక్కడే గడుపుతు న్నారు. మల్లన్న గండి రిజర్వాయర్ పర్యాటక అందాలు చూడాలంటే స్టేషన్ ఘన్ పూర్ నుండి కొత్తపెళ్లి, తాటికొండ, జిట్టగూడెం గ్రామాల మీదుగా వెళ్లాలి. ఇటీవలే స్టేషన్ ఘన్ పూర్ నుండి మల్లన్నగండి వరకు నూతనంగా బీటీ రోడ్డు సౌకర్యం కూడా కల్పించారు. స్టేషన్ ఘన్ పూర్ నుండి పల్లగుట్ట, కృష్ణాజి గూడెం, ఫతేపూర్, గార్లగడ్డ తండా మీదు గా కూడా వెళ్లవచ్చు. నర్మెట మండలం నుండి ఆగాపేట, గండి రామారాం మీదుగా, తరిగొప్పుల మండలం నుండి శ్రీపతి పెళ్లి, లింగంపల్లి, అబ్దుల్ నాగారం గుండా మల్లన్న గండి కూడా రావచ్చని పర్యాటకులు చెబుతు న్నారు.
“పర్యాటకంగా తీర్చిదిద్దాలి” ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రత్యేక చొరవ తీసుకొని మల్లన్నగండి రిజర్వాయర్ నుపర్యాటక కేంద్రం గా తీర్చిదిద్దాలని స్థానికులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
