MLA Yashaswini Reddy Mylarm Town Feeder
ఆకేరు న్యూస్,రాయపర్తి: మండలంలోని మైలారం గ్రామంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది… మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా 9 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన టౌన్ ఫీడర్ ను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు…
ఈ సందర్భంగా విద్యుత్ శాఖ DE ,అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
టౌన్ ఫీడర్ అందుబాటులోకి రావడంతో మైలారం గ్రామంలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, అంతరాయాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు..
మైలారం గ్రామ ప్రజల విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించేలా టౌన్ ఫీడర్‌ను అందుబాటులోకి తీసుకురావడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు…
మైలారం గ్రామంలో నూతన టౌన్ ఫీడర్ ప్రారంభంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు….
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు హమ్య నాయక్, కరెంట్ అధికారులు డి ఈ, ఏ ఈ, సబ్ ఇంజనీర్ ,లైన్మెన్, నాయకులు అధికారులు రైతులు ప్రజలు వివిధ వ్యక్తులు పాల్గొన్నారు…

Please tell us what is wrong. Your report will be sent to the website team.
