Actress Shakeela Neck surgery
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో నటి షకీలా తన అనుభవం ద్వారా వెల్లడించారు. గంటల తరబడి మొబైల్ ఫోన్ ఉపయోగించడం వల్ల తీవ్ర మెడ నొప్పికి గురైన ఆమె చివరకు మెడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్‌కు సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె తెలిపారు.
* నాలుగు గంటల వరకు గేమ్స్ ఆడా
తాను మంచంపై పడుకుని వరుసగా నాలుగు గంటల వరకు ఫోన్లో గేమ్స్ ఆడేవారని, మధ్యలో టీ లేదా కాఫీ కోసం మాత్రమే లేచేవారని చెప్పారు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా గంటల తరబడి చూసేవారట. ఇలా ఫోన్‌ను ఒకే భంగిమలో ఎక్కువసేపు చూడటం వల్ల మెడపై తీవ్ర ప్రభావం పడిందని ఆమె వెల్లడించారు.
* మెడలోని నరాలపై ప్రభావం.. శస్త్ర చికిత్సకు దారితీసింది
మెడలోని నరాలపై ప్రభావం పడటంతో పరిస్థితి తీవ్రంగా మారి శస్త్రచికిత్స అవసరమైందని షకీలా చెప్పారు. చికిత్స అనంతరం మెడకు పట్టీతో కనిపించిన ఆమె, ఈ అనుభవం తనకు ఎంతో బాధాకరంగా ఉందని పేర్కొన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
* పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త
“ఫోన్ అవసరమే.. కానీ అతిగా ఉపయోగించకండి” అంటూ షకీలా ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. ఉపయోగం లేని వీడియోలు, రీల్స్ చూస్తూ సమయం వృథా చేయకుండా మొబైల్‌ను అవసరానికి మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
