CM Revanth Reddy Mulugu Tour
* వనదేవతల సన్నిధిలో నూతన పెన్షన్ విధానానికి సీఎం శ్రీకారం
* 16 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల నిర్మాణానికి పైలాన్ ప్రారంభం
* సీఎం పర్యటన వివరాలు వెల్లడించిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు:
ఈనెల 16న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ములుగు జిల్లాకు రానుండడంతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి అనసూయ సీతక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన వివరాలను గురువారం వెల్లడించారు. మొదట జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణ పనులు, పైలాన్ పనులు, జిల్లా కలెక్టర్ బోర్ఖాడే హేమంత్ సహదేవరావు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ లతోపాటు వివిధ శాఖల జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలతో పాటిస్తూ పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
అనంతరం పాత్రికేయులతో మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి ఎనిముల రేవంత్ రెడ్డి ములుగు నియోజకవర్గంలో పర్యటించనున్నారని తెలిపారు. మధ్యాహ్నo సమయంలో మేడారం చేరుకుని శ్రీ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని, అనంతరం వనదేవతల సన్నిధి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వితంతు మహిళలు, ఒంటరి మహిళలకు సంతృప్త స్థాయిలో పింఛన్లు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు.
ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి గతంలో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు .మేడారం కార్యక్రమాల అనంతరం ముఖ్యమంత్రి ములుగు జిల్లా కేంద్రం నకు చేరుకుని, రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా మూడు విడతల్లో సుమారు రూ.16 వేల కోట్లతో చేపట్టనున్న హ్యామ్ రోడ్ల పనులకు సంబంధించిన అభివృద్ధి పనుల పైలాన్‌ను గట్టమ్మ సమీపంలో ఆవిష్కరిస్తారని తెలిపారు.
ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి అనుసంధానం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో రహదారి పనులను చేపట్డడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం ముఖ్యమంత్రి నూతన కలెక్టరేట్‌కు చేరుకుని తొలుత తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి, నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. కలెక్టరేట్ ఆవరణంలో ఏర్పాటు చేసే సభలో ప్రజలు, అభిమానులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని,
ఈ పర్యటనను విజయవంతం చేసేందుకు ములుగు నియోజకవర్గ, జిల్లా ప్రజలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సీహెచ్ మహేందర్, సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవీందర్ చందర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
