Alternative Crops for Changing Rainfall
ఆకేరు న్యూస్ , కమలాపూర్ :
ఎల్నినో ప్రభావంతో మారుతున్న వాతావరణ పరిస్థితులు, తగ్గుతున్న వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హనుమకొండ జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నరసయ్య సూచించారు. గురువారం కమలాపూర్ మండలంలోని గూడూరు రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఆత్మ (ATMA) సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
మండల వ్యవసాయ అధికారి వేణు మాట్లాడుతూ రైతులు తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని, దీర్ఘకాలిక లాభాలను అందించే ఆయిల్ పామ్ సాగు విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాల వివరాలను రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (AEOs) ప్రశాంత్, జయప్రకాష్, ప్రతాప్, తిరుపతి, రహీం తదితరులు పాల్గొని సదస్సు విజయవంతానికి సహకరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
