Kamallapur NCC Tiranga Rally
* దేశభక్తి చాటిన కమలాపూర్ ఎం.జె.పి బాలుర పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు
* ఘనంగా హర్ ఘర్ తిరంగా , ఘర్ ఘర్ తిరంగా
* 50 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
హనుమకొండ జిల్లా కమలాపూర్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాల ఎన్సీసీ క్యాడేట్లు శుక్రవారం భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ ప్రదర్శన పాఠశాల నుంచి కమలాపూర్‌లోని గూడూరు క్రాస్ రోడ్డు చౌరస్తా వరకు 50 మీటర్ల పొడవున్న భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ చేసిన నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు భారతీయులంతా ఒక్కటే అనే సందేశాన్నిస్తూ, దేశ పౌరులంతా ఐక్యంగా ఉండాలని విద్యార్థులు సమైక్యతను చాటారు. ప్రతి విద్యార్థి చేతిలో జాతీయ జెండాను పట్టుకుని, దేశభక్తి పరిమళించేలా ఉత్సాహంగా అడుగులు వేశారు.
కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ తాడూరి రవీందర్, వైస్ ప్రిన్సిపల్ శ్రీవాణి, ఎన్సీసీ ఏఎన్‌ఓ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
