Chilpur Har Ghar Tiranga Yatra
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశ ప్రజలలో దేశ భక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచందరావు, జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆదేశాల మేరకు చిల్పూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో బిజెపి మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. తిరంగా యాత్రలో బిజెపి జిల్లా నాయకులు పెండ్యాల దిలీప్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వెలిశాల శ్రీనివాస్, దళిత మోర్చా అధ్యక్షులు కందుకూరు రజినీకార్, సోషల్ మీడియా కొకన్వీనర్ ముక్కెర రమేష్, మండల నాయకులు దామెర ప్రశాంత్, బోసు నాయక్, శైలేష్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
