Teja Sajja
* రియాలిటీ షోలోకి హీరో ఎంట్రీ
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : అంతర్జాతీయంగా ఆదరణ పొందిన గ్లోబల్ ఫ్రాంచైజ్ ‘ది ట్రైటర్స్’ను ప్రైమ్ వీడియో తెలుగులోకి తీసుకొస్తుంది. ఈ ప్రోగ్రాం కు హోస్ట్‌గా తొలిసారి రియాలిటీ షోలోకి హీరో తేజ సజ్జ ఉండబోతున్నారు.
20 మంది విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనే ఈ హై-ఆక్టేన్ షో.. నాలుగు వారాల పాటు 10 ఎపిసోడ్స్‌గా ప్రసారం కానుంది.
ఈ రియాలిటీ గేమ్ షో అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది.ఎస్ ఓ ఎల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సిరీస్ ‘ది ట్రైటర్స్’ ఫార్మాట్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
హిందీలో ఇప్పటికే రెండు సీజన్లకు వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత.. ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు.
*నాలుగు వారాలు.. 10 ఎపిసోడ్స్.
‘ది ట్రైటర్స్ తెలుగు’ నాలుగు వారాల పాటు తెలుగు భాషలో, ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో ప్రైమ్ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ప్రతి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త ఎపిసోడ్స్ విడుదల కానున్నాయి.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియాలిటీ ఫార్మాట్స్‌లో ‘ది ట్రైటర్స్’ ఒకటి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లో స్థానిక వెర్షన్స్‌తో ఈ ఫార్మాట్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ ఫ్రాంచైజ్‌గా ఎదిగింది.
ఇప్పుడు తెలుగు వెర్షన్‌లోకి అడుగుపెడుతున్నప్పటికీ.. గేమ్ రూల్స్ మాత్రం అదే. కానీ ఆటలో ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా సస్పెన్స్.
దాగి ఉన్న ఐడెంటిటీస్, సీక్రెట్ అలయన్స్‌లు, వ్యూహాత్మక ఎత్తుగడలు, ఊహించని ద్రోహాలు.. కంటెస్టెంట్స్ ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకోగలరో పరీక్షించనున్నాయి. గేమ్‌లోని ‘ఇన్నోసెంట్స్’ తమ మధ్య దాగి ఉన్న ‘ట్రైటర్స్’ ను సమయం మించకముందే గుర్తించాల్సి ఉంటుంది.
డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ ఒరిజినల్స్, ప్రైమ్ వీడియో (SVOD), అమెజాన్ MGM స్టూడియోస్ ఇండియా నిఖిల్ మాధోక్ మాట్లాడుతూ.. “మైండ్ గేమ్స్, స్ట్రాటజీపై దృష్టి పెట్టడంతో ‘ది ట్రైటర్స్ తెలుగు’ అన్‌స్క్రిప్టెడ్ స్పేస్‌లో నిజంగా ఆసక్తికరమైన, డిఫరెంట్ షోగా నిలుస్తుంది.
హిందీలో రెండు అత్యంత విజయవంతమైన సీజన్ల తర్వాత ఈ ఫ్రాంచైజ్‌ను తెలుగులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.
ఈ ఎడిషన్‌ను లీడ్ చేయడానికి తేజ సజ్జ అద్భుతమైన హోస్ట్. ఆయన చరిష్మా, స్పాంటేనియిటీ, ప్రేక్షకులతో సహజమైన కనెక్షన్ ఈ షోకు ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను తీసుకొస్తాయి. ‘ది ట్రైటర్స్ తెలుగు’ ద్వారా ఈ ఫ్రాంచైజ్‌ను మరింత విస్తరించి, భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం.”
ఫజీలా అల్లానా, పార్ట్నర్ అండ్ కో-ఫౌండర్, SOL ప్రొడక్షన్స్ మాట్లాడుతూ.. ది ట్రైటర్స్’ను తెలుగులోకి తీసుకురావడం మాకు ఎంతో ప్రత్యేకమైన అవకాశం. నమ్మకం, ఆశయం, రిలేషన్షిప్స్, ద్రోహం వంటి యూనివర్సల్ అంశాలతో కథను చెప్పేందుకు ఈ ఫార్మాట్ మంచి వేదికను అందిస్తుంది.
అదే సమయంలో తెలుగు ఎంటర్టైన్మెంట్కు ఉన్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం, కల్చరల్ ఫ్లేవర్‌ను ఇందులో తీసుకురావాలని కోరుకున్నాం. ప్రపంచాన్ని గ్రాండ్‌గా, ఇమర్సివ్‌గా రూపొందించాలనుకున్నప్పటికీ.. ఇందులో గేమ్ ఆడే వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలే ప్రధానంగా ఉండేలా చూసుకున్నాం.
ప్రైమ్ వీడియోతో కలిసి మేము రూపొందించిన ఈ షోపై ఎంతో గర్వంగా ఉన్నాం. గేమ్ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు చర్చించుకుంటూ, అంచనాలు వేస్తూ, తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ను ఎంచుకుంటారని ఎదురుచూస్తున్నాం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
