indiramma House Construction Begins in Vankudoth Thanda
* ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహకారం
* లబ్ధిదారుల స్థలాల్లో ముగ్గు పోసి శంకుస్థాపన చేసిన సర్పంచ్ దేవేందర్
ఆకేరు న్యూస్, రాయపర్తి:
పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో రాయపర్తి మండల పరిధిలోని వాంకుడోత్ తండా గ్రామ పంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు శుక్రవారం కోలాహలంగా ప్రారంభమయ్యాయి.
గ్రామ సర్పంచ్ వాంకుడోతూ దేవేందర్, ఉప సర్పంచ్ భూక్య నవీన్ హాజరై లబ్ధిదారుల స్థలాల్లో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి, ముగ్గు పోసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
* పేదల సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఈ సందర్భంగా సర్పంచ్ దేవేందర్, మాట్లాడుతూ — “పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున రని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేరుతోంది. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ దశలవారీగా ఇండ్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. పనులు వేగవంతం నాణ్యతా ప్రమాణాలతో గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి” అని సూచించారు.
సొంతింటి పనులు ప్రారంభం కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ, ఇండ్లు మంజూరు చేసిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి, అలాగే సహకరించిన గ్రామ ప్రజాప్రతినిధులు మరియు అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, హౌసింగ్ ఏ ఈ నిఖిల్,పంచాయతీ కార్యదర్శి, అభిలాష్, గ్రామ పంచాయతీ కారో బార్ బేబి, సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, తండా పెద్దలు, గ్రామస్తులు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
