Mulugu Collectorate
* నూతన జిల్లా కలెక్టరేట్ సమీకృత భవనం వద్ద కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకుల పాలాభిషేకం
ఆకేరు న్యూస్,ములుగు :
ములుగు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితమైన జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయ భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ములుగు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సమీకృత భవనం ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకంనిర్వహించారు.
జిల్లాకు నూతన సమీకృత కార్యాలయం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అందిన అభివృద్ధి ఫలమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు పోరిక విజయ్ రాంనాయక్, జాకారం సర్పంచ్ దాసరి సమత రమేష్, మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకుతోట చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ రాందాస్, ఉయ్యాల భద్రయ్య, ముంజల బిక్షపతి, దూడబోయిన శీను, కోడెపాక మహేందర్, మేకల రాజు, ఆకుతోట సంపత్, కేతిపాక సుమన్, షేక్ చాంద్ పాషా, పాడియా చంటి, జరుపుల పవన్, సోయాల్, వంశీ, సిద్దు తదితర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
