Woman Creates Ruckus at Bhubaneshwar Airport
* బెల్ట్ ఎక్కి ఫైళ్లు విసిరికొడుతూ హంగామా
ఆకేరు న్యూస్, డెస్క్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుహ్య పరిణామం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇండిగో సంస్థకు చెందిన విమానం చివరి నిమిషంలో ఉన్నట్టుండి రద్దు కావడంతో ఓ మహిళా ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏరోడ్రోమ్ లాంజ్ మరియు కౌంటర్ ప్రాంగణంలోనే ఆమె నిరసనకు దిగి, ఏకంగా లగేజీ కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బందిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
* అనారోగ్యంతో ఉన్న బిడ్డను చూసేందుకు వెళ్తుండగా షాక్..
బాధితురాలు మరియు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన బిడ్డను అత్యవసరంగా చూసేందుకు భువనేశ్వర్ నుండి ఢిల్లీకి ప్రయాణించాల్సి ఉంది. అత్యవసర పరిస్థితి కావడం, సమయం ఆసన్నమవుతుండటంతో ఆమె తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అయితే విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత సాంకేతిక లేదా ఆపరేషనల్ కారణాల వల్ల సదరు విమానాన్ని రద్దు చేసినట్లు విమానయాన సంస్థ సిబ్బంది ప్రకటించారు.
తీవ్ర అనారోగ్యంతో ఉన్న బిడ్డను కలుసుకునేందుకు వెళ్తున్న సమయంలో అనుకోకుండా విమానం రద్దు కావడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సరైన సమాచారం లభించకపోవడంతో ఆ మహిళ తీవ్ర ఆవేదనకు, ఆవేశానికి గురయ్యారు.
* ఎయిర్‌పోర్ట్‌లో తీవ్ర హంగామా..
ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ విమానయాన సంస్థ కౌంటర్ వద్ద తీవ్రంగా నిరసన తెలిపారు. లగేజీ రవాణా చేసే కన్వేయర్ బెల్ట్‌పైకి ఎక్కి సిబ్బంది ప్రవర్తనపై విరుచుకుపడ్డారు. కౌంటర్‌పై ఉన్న ఫైళ్లను, పేపర్లను విసిరికొడుతూ తన ఆవేదనను వెళ్లగక్కారు. విమానం రద్దు వల్ల తానెంతటి మానసిక వేదనను అనుభవిస్తున్నానో చెబుతూ అక్కడున్న ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు.
ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళ పరిస్థితి నెలకొనడంతో రంగంలోకి దిగిన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సిబ్బంది వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ మహిళకు నచ్చజెప్పి కన్వేయర్ బెల్ట్ పైనుంచి కిందకు దింపి, ఇతర ప్రయాణికులకు ఆటంకం కలగకుండా పరిస్థితిని ప్రశాంత పరిచారు. అనంతరం ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్ల విషయమై ఆమెకు సహకారం అందించే ప్రయత్నం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
