ఆకేరు న్యూస్, వర్ధన్నపేట:
సాగునీరు అందక ఎండిపోతున్న పంటలను కాపాడాలని, వెంటనే ఎస్సారెస్పీ (SRSP) ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వినూత్న నిరసన చేపట్టారు.
సోమవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండా సమీపంలో ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువలోకి ఆయన స్వయంగా దిగి, రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే రైతన్నలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి కాలువలకు సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలను కాపాడే వరకు రైతులకు అండగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
