Football Player Girish Vardhan
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఫుట్ బాల్ జాతీయ క్రీడాకారుడు జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండకు చెందిన మారపాక గిరీష్ వర్ధన్ ను 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సత్కరించారు. 2025-2026 సంవత్సరానికి గాను జనగామ జిల్లా నుండి జమ్ము & కాశ్మీర్ రాష్ట్రంలో జాతీయ స్థాయి ఫుట్ బాల్ క్రీడల్లో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచిన మారపాక గిరీష్ వర్ధన్ ను ఎంఎల్ఏ, ప్రభుత్వ చీఫ్ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ సందిప్ కుమార్ ఝా, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేతుల మీదుగా గుర్తింపు (ప్రశంస) పత్రం అందించారు. నియోజకవర్గ కేంద్రంలోని టీజీ డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న మారపాక గిరీష్ వర్ధన్ జాతీయస్థాయి గుర్తింపు తీసుకురావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, క్రీడాకారులు, తాటికొండ గ్రామస్తులు అతనికి అభినందనలు తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
