Diceased person Polu Venkataiah
* కాజీపేట శివారులో దారుణం
ఆకేరు న్యూస్, హనుమకొండ: గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాజీపేట శివారు రాంపూర్ ఊర చెరువు సమీపంలో దారుణం జరిగింది.చిలుపూరు మండల కేంద్రానికి చెందిన పోలు వెంకటయ్య ( 45 ) అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడు మద్యం సేవించినట్లు ఆనవాల్లు కనిపిస్తున్నాయి. మృతుడి కుమార్తెకు సంబందించిన విషయంలో గత కొంత కాలంగా ఘర్షణ జరుగుతున్నట్లుగా సమాచారం. ఇదే విషయానికి సంబందించి మద్య వర్తి ద్వారా మాట్లాడుకుందామని పిలిపించి హత్య చేసినట్లుగా సమచారం. పాత కక్షలతో ప్రణాళికాబద్దంగా ఈ హత్య జరిగి ఉంటుందా అన్న కోణంలో ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
——————————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
