M.V. Ramana demands to Implement CM’s Promises to Toddy Tappers
* యం.వి.రమణ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
పాపన్న జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్లుగీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు యం.వి.రమణ డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 2 నుండి 18 వరకు అమరుల యాధిలో గీతన్నల చైతన్య బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తు మంగళవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్, రఘునాథపల్లి మండలాలకు చేరింది. ఈ సందర్భంగా కిలాషాపురం కోటలో పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి బాల్నే వెంకట మల్లయ్య అధ్యక్షతన జరిగిన అమరుల యాదిలో గీతన్నల చైతన్య బస్సు యాత్రను ఉద్దేశించి యం.వి.రమణ మాట్లాడుతూ గీత కార్మికులకు పెన్షన్ 4 వేలకు పెంచుతామని, ఎక్సిగ్రేషియా 10 లక్షలు ఇస్తామని ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదని అన్నారు.
వృత్తిలో ప్రమాదాలు జరిగిన వారికి ఇవ్వాల్సిన ఎక్సిగ్రేషియా 20 కోట్ల రూపాయలు అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినప్పటికీ ఇవ్వలేదని అన్నారు. 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కొత్తగా ఎవరి దరఖాస్తులు స్వీకరించడం లేదని అన్నారు. పాపన్న జయంతి ఉత్సవాలలో స్పష్టమైన ప్రకటన చేసి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వృత్తిలో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచం ఇస్తుందన్నారు. రాష్ట్రంలో సభ్యత్వం కలిగిన వాళ్లు 2 లక్షల 30 వేల మంది ఉండగా కేవలం 30 వేల మందికే ఇచ్చారని అన్నారు. వృత్తి చేసే వారందరికీ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. తాటి ఈత చెట్ల పెంపకానికి ప్రతి సొసైటీకి ఐదు ఎకరాలు చొప్పున భూమి ఇవ్వాలని, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలని అన్నారు. నందనములోని నీరా ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో నీరాకు కేటాయించిన 25 కోట్లు, సంక్షేమాని కి కేటాయించిన 67 కోట్లు వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలన్నారు. గీత కార్మికుల సమస్యలు పరిష్కారం కై ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సుప్రజా హాస్పిటల్స్ ఎండి సిగ విజయ్ కుమార్, యాత్ర బృందం సభ్యులు సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిదగోపి, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌని వెంకన్న, సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు భీమగోని చంద్రయ్య, పామనుగుళ్ళ అచ్చాలు, బోలగాని జయరాములు, చౌగాని సీతారాములు, కొండం కరుణాకర్,మొక్క నాగేశ్వరరావు, బుర్ర సుధాకర్, పాలకూరి జగన్, సురుగు రాజేష్, హనుమాండ్ల కాడి నవీన్, రాష్ట్ర కమిటీ సభ్యులు కనకట రాజయ్య, పరిధిల భాస్కర్, బండపల్లి శంకరయ్య, మాచర్ల రఘురాములు, పాపన్న ట్రస్ట్ చైర్మన్ తాళ్లపల్లి రామస్వామి, కుర్ర రాజు, నామాల యాదగిరి, బాల్నే రాజయ్య, బాల్నే ఉమాపతి, గట్టు రమేష్, పులి శ్రీనివాసు, యాదన్న పరంధామ, బైరగొని వెంకటయ్య మలుగూరి సంతోష్ కుమార్,మూల వైకుంఠం, ఆంజనేయులు, వెంకన్న, మురళి తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
