GO 97 Polytechnic Students
* రోడ్డెక్కిన పాలిటెక్నిక్ విద్యార్థులు
ఆకేరు న్యూస్, జనగామ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో 97 (GO 97) ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పాలిటెక్నిక్ విద్యార్థులు శుక్రవారం భారీ ఆందోళన చేపట్టారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల నుంచి బస్ స్టాండ్ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
* విద్యార్థులకు బీఆర్ఎస్ మద్దతు
విద్యార్థులు చేపట్టిన ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరై పూర్తి మద్దతు ప్రకటించారు. విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు నాశనమయ్యే ప్రమాదం ఉందని, తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
* అసెంబ్లీ ముట్టడిస్తాం.. విద్యార్థుల హెచ్చరిక
విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమయ్యారని, ఆయన వెంటనే విద్యాశాఖ బాధ్యతల నుంచి లేదా సీఎం పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో అసెంబ్లీ ముట్టడికి వెనుకాడబోమని విద్యార్థులు తీవ్రంగా హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
