Errabelli Dayakar Rao Arrest
* ఎర్రబెల్లి అరెస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్: నర్సంపేట బంద్కు బయలుదేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావును జనగామ పోలీసులు బైపాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్డుపైనే నిరసన తెలిపేందుకు ఎర్రబెల్లి ప్రయత్నించగా, పోలీసులు ఆయనను సర్దిచెప్పి స్టేషన్కు తరలించారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ముందస్తు నోటీసులు లేకుండా రాత్రికి రాత్రే తొలగించడం దుర్మార్గమని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఈ ఘటనను నిరసిస్తూ తాము చేపడుతున్న ఆందోళనలను అడ్డుకోవడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
