Jangaon Auto Driver Death
* పెళ్లయిన ఏడాదికే విషాదం
ఆకేరు న్యూస్, జనగామ: రఘునాథపల్లి మండల కేంద్రంలో ఒక ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఖిలాషాపురం రోడ్డులోని తిరుమల వైన్స్ ఎదురుగా ఆటోలో నుంచి కిందపడి ఒక వ్యక్తి మృతి చెందాడనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడిని కోమటిగూడెం గ్రామానికి చెందిన ఏదునూరి రమేష్ (27)గా పోలీసులు గుర్తించారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ అయిన రమేష్, ఉదయం వేళ మద్యం సేవించిన స్థితిలో ఆటో డ్రైవర్ సీటు నుంచి కిందపడి మరణించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అతనికి ఏడాది క్రితమే వివాహమైందని, గతంలో ఫిట్స్ (ఎపిలెప్సీ) వ్యాధి సమస్య కూడా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. మద్యం మత్తులో ఉన్న సమయంలో ఫిట్స్ రావడమే మృతికి కారణమా? లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన ఏడాదికే యువకుడు మృతి చెందడంతో కోమటిగూడెంలో తీవ్ర శోకసంద్రం అలుముకుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
