Global Private School Salaries
* గ్లోబల్ ప్రైవేట్ స్కూల్కు తాళం వేసిన సిబ్బంది
ఆకేరు న్యూస్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్లోబల్ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. గత మూడు నెలలుగా తమకు రావాల్సిన జీతాలను యాజమాన్యం చెల్లించడం లేదంటూ పాఠశాల వ్యాన్ డ్రైవర్లు, ఇతర నాన్-టీచింగ్ సిబ్బంది శుక్రవారం స్కూల్కు తాళం వేసి ఆందోళనకు దిగారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో పనిచేస్తున్న తమకు గత మూడు నెలలుగా యాజమాన్యం వేతనాలు ఇవ్వకుండా తీవ్రంగా వేధిస్తోంది. పలుమార్లు జీతాల గురించి ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వ్యాన్ డ్రైవర్లు, ఇతర సిబ్బంది ఒకటై పాఠశాల ముఖ్య ద్వారానికి తాళం వేశారు.
మరొకవైపు, హన్మకొండలో ముఖ్యమైన మీటింగ్ ఉందనే నెపంతో పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ముందస్తుగానే సెలవు ప్రకటించింది. తమకు న్యాయం జరిగే వరకు మరియు బకాయి పడ్డ జీతాలు పూర్తిగా చెల్లించే వరకు తమ ఆందోళన విరమించేది లేదని సిబ్బంది తేల్చి చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
