SI Name Cyber Fraud
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: నెల్లికుదురులో ఖాకీ పేరు చెప్పి సైబర్ కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. స్థానిక ఎస్సై పేరు చెప్పి ఒక వైన్స్ షాపు ఉద్యోగి నుంచి రూ.78,500 కాజేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కేసముద్రం ప్రాంతానికి చెందిన దేశబోయిన కుమారస్వామి నెల్లికుదురులోని ‘శివకేశవ వైన్స్’లో కౌంటర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అపరిచిత వ్యక్తి కుమారస్వామికి ఫోన్ చేసి తాను నెల్లికుదురు ఎస్సైని అని పరిచయం చేసుకున్నాడు. “మా డ్రైవర్ వైన్స్ షాప్‌నకు వచ్చి రూ.25 వేల నగదు ఇస్తాడు. మీరు దానికి బదులుగా నేను పంపే క్యూఆర్ (QR) కోడ్‌కు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపండి” అని చెప్పాడు.
ఎస్సై ఫోన్ చేశాడనే నమ్మకంతో కుమారస్వామి కేటుగాడు చెప్పిన మాటలు నమ్మాడు. సైబర్ నేరగాడు దఫదఫాలుగా క్యూఆర్ కోడ్లు పంపగా, రెండు రోజుల వ్యవధిలో మొత్తం రూ. 78,500 ట్రాన్స్ఫర్ చేశాడు.
అయితే ఆ మొత్తాన్ని పొందిన కేవలం ఒక గంట వ్యవధిలోనే సదరు వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి, ఇంకా డబ్బులు పంపాలని ఒత్తిడి చేయడంతో కుమారస్వామికి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వెంటనే బాధితుడు 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
* పోలీసుల విజ్ఞప్తి…
అపరిచిత వ్యక్తులు అధికారులుగా నమ్మించి క్యూఆర్ కోడ్లు లేదా అకౌంట్ నంబర్లు పంపి డబ్బులు అడిగితే ఎలాంటి లావాదేవీలు జరపవద్దని, వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి సమాచారం అందించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
