Mahabubabad Road Accident
* అక్కడికక్కడే దుర్మరణం
ఆకేరు న్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని అండర్ బ్రిడ్జ్ సమీపంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కురవి మండలం సూర్య తండా (నల్లెల్ల) ప్రాంతానికి చెందిన అజ్మీరా మంగత (40) అనే మహిళ, స్థానిక అండర్ బ్రిడ్జ్ గుండా కాలినడకన రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన లారీ ఆమెను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంగత తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
