Indiramma Houses Kamalapur
* రెండవ విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు
* హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితెల ప్రణవ్
ఆకేరు న్యూస్, కమలాపూర్:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ద్వారా పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తోందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. బుధవారం కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలో ఇందిరమ్మ గృహప్రవేశ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు కేటాయించి, వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని తెలిపారు. మొదటి విడత ఇళ్ల కేటాయింపు విజయవంతంగా సాగుతుండగా, రెండవ విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేసి అర్హులైన నిరుపేదలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఝాన్సీ రాణి, భీంపల్లి గ్రామ సర్పంచ్, కమలాపూర్ మండల అధ్యక్షుడు వాసాల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్ల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్, మాజీ ఎంపీపీ తడక శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చంద్రమౌళి, మరియు రమేష్, నవీన్, మనీష్, రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
