TGSRTC Rakhi Special Bus Charges
* పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటున్నారా?
* సాధారణ బస్సులకే ‘స్పెషల్’ బోర్డులు..
అకేరు న్యూస్ హైదరాబాద్ : ప్రయాణికుల నుంచి అదనపు వసూళ్ల ఆరోపణలు రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరుల ఇళ్లకు వెళ్లే ప్రయాణికులతో తెలంగాణలోని బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అయితే ఇదే సమయంలో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాధారణ రోజుల్లో ఉన్న బస్సులకే ‘స్పెషల్’ బోర్డులు ఏర్పాటు చేసి, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
* రూట్ల వారీగా పెరిగిన ఛార్జీలు..
* నార్కెట్పల్లి – సూర్యాపేట:
సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.80 కాగా.. రాఖీ పండుగ రోజు రూ.140కి పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
* ఉప్పల్ – హన్మకొండ
సాధారణ రోజుల్లో రూ.340 ఉన్న టికెట్.. రాఖీ సందర్భంగా రూ.440కి పెరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
* మెదక్ – నర్సాపూర్:
సాధారణ రోజుల్లో రూ.70 ఉన్న టికెట్ ధర.. పండుగ రోజు రూ.100కి పెరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.
* ‘స్పెషల్’ పేరుతో అదనపు బాదుడు?
పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయడం వరకు ఓకే కానీ.. ఇప్పటికే సాధారణంగా నడుస్తున్న బస్సులకే ‘స్పెషల్’ బోర్డులు పెట్టి అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
రాఖీ పండుగ రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తుండటంతో.. పెంచిన ఛార్జీలు చెల్లించక తప్పడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? సాధారణ బస్సులను ‘స్పెషల్’గా మార్చి నడుపుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు రాఖీ సందర్భంగా ప్రత్యేక బస్సులకు 50 శాతం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని ఆర్టీసీ అధికారులు గతంలోనే ప్రకటించినట్లు సమాచారం ఉంది.
పండుగ వేళ ప్రయాణికులకు సౌకర్యం కల్పించాల్సిన ఆర్టీసీ..
* అదనపు ఛార్జీలతో ప్రయాణికులపై భారం మోపుతోందా?
స్పెషల్ బస్సుల పేరుతో వసూలు చేస్తున్న అదనపు ఛార్జీలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఏం సమాధానం చెబుతారో చూడాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
