Nepal China Border Earthquake
* నేపాల్ – చైనా సరిహద్దులో భూకంపం
* భయం..భయంగా ప్రజలు
* మరింత తీవ్రత ఉంటుందని హెచ్చరికలు
ఆకేరు న్యూస్, డెస్క్: ఇప్పటికే జల ప్రళయంతో విలవిల్లాడుతున్న నేపాల్ ప్రజలకు మరో ముప్పు పొంచి ఉందని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతున్నారు. సురక్షితంగా భావించే ఎత్తయిన పర్వత ప్రాంతాలకు నేపాల్ ప్రజలు చేరుకుంటున్నారు. వరద ఉధృతిలో ఇప్పటికే వందలాది మంది ప్రజలు గల్లంతు కావడం .. మరో 1500 మంది జాడ కనిపించడం లేదంటున్నారు.. మరో కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ జలగండం విరుచుకుపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.. అధికారులు ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తుండగానే నేపాల్ – చైనా సరిహద్దు ప్రాంతం సియాచిన్లో భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేల్ పై 5.1 గా నమోదైంది. దీంతో నేపాల్ – చైనా సరిహద్దు ప్రాంతాలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు..
——————————-

Please tell us what is wrong. Your report will be sent to the website team.
