Kamalapur Janjirala Punnami Celebrations
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
కమలాపూర్ మండల కేంద్రంలో రాఖీ పండుగను పురస్కరించుకుని పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో జంజిరాల పున్నమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక పద్మశాలి సంఘ భవనంలో మార్కండేయ భగవానుడి చిత్రపటానికి పూలమాలలు వేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో యజ్ఞోపవేతం ధరించి, గాయత్రి మంత్రోచ్ఛారణల మధ్య పవిత్రమైన జంజిర ధారణ చేపట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం కమలాపూర్ ప్రధాన రహదారిపై చేనేత వృత్తికి ప్రతీక అయిన మగ్గంతో కూడిన రథయాత్రను వైభవంగా నిర్వహించారు. భారీ బైక్ ర్యాలీ, బాణసంచా పేలుళ్లు, డీజే పాటలతో రథయాత్ర బస్టాండ్ కూడలి వరకు నిర్వహించారు. ఈ వేడుకలు పద్మశాలీల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని మండలాధ్యక్షులు బొప్ప శివశంకర్ తెలిపారు.
కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షులు బొప్ప శివశంకర్, ప్రధాన కార్యదర్శి పోరండ్ల రమేష్, పట్టణ అధ్యక్షులు బైరి దశరథం, ప్రధాన కార్యదర్శి పులికంటి రాజేందర్, యూత్ కమిటీ అధ్యక్షులు ఆడెపు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి మార్గం చైతన్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బైరీ జనార్ధన్, పరపతి సంఘం ప్రధాన కార్యదర్శి వెల్ది రాఘవులు తదితర సంఘ నాయకులు, కుల బాంధవులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
