Ananthika Sanilkumar about Nani The Paradise movie
అకేరు న్యూస్ హైదరాబాద్:
నటి అనంతిక సనిల్కుమార్ ‘మ్యాడ్’ హీరోయిన్ గా అందరికీ సుపరిచితురాలు. రోమాంచకం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సెప్టెంబరు 3న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ విషయాలను గురించి ప్రస్థావించారు.
* లోన్లు తీసుకున్న సందర్భాలు కూడా..
తన సినీ, వ్యక్తిగత ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గలేదని అవంతిక తెలిపారు. కార్యక్రమాలు నిర్వహించేందుకు అవసరమైన ఖర్చుల కోసం అప్పులు, లోన్లు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. కెరీర్లో ఎదగడానికి కేవలం ప్రతిభ ఉంటే సరిపోదని.. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల కూడా అవసరమని అన్నారు.
* లుక్స్ కారణంగా నని సినిమా మిస్
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ప్యారడైజ్ లో అవకాశం చేజారిపోయింది. లుక్స్ కారణంగా ఇలా జరిగిపోయింది. ఇలాగే కెరీర్ మొదట్లో కూడా ఫొటో పంపగానే చిన్నపిల్లలా ఉందని మేకర్స్ రిజక్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. రోమాంచకం హిట్ అవుతుందని భావిస్తున్నానని అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
