MP Kadiyam Kavya, Nepal Disaster Letter
* బాధిత తెలంగాణ వాసులకు తక్షణ వైద్యం అందించాలని విజ్ఞప్తి
* గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరం చేయాలి
అకేరు న్యూస్ హనుమకొండ:
నేపాల్లో సంభవించిన విపత్తులో తెలంగాణకు చెందిన పలువురు గాయపడటం, కొందరు మృతి చెందడం, మరికొందరు గల్లంతైన నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య స్పందించారు. బాధితుల పరిస్థితిని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాశారు. తెలంగాణకు చెందిన బాధితులకు తక్షణ సహాయ చర్యలు చేపట్టడంతో పాటు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
నేపాల్లోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు, రెస్క్యూ బృందాలతో సమన్వయం చేసుకుంటూ గాయపడిన తెలంగాణ వాసులకు అత్యవసర వైద్య సేవలు, చికిత్స, మందులు, ఆసుపత్రి సదుపాయాలు అందించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించాలని కోరారు.
* గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు
విపత్తు అనంతరం ఆచూకీ తెలియకుండా ఉన్న తెలంగాణకు చెందిన వారి కోసం శోధన చర్యలను మరింత ముమ్మరం చేయాలని కడియం కావ్య కోరారు. భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికారులు, రెస్క్యూ బృందాలు, సంబంధిత ఏజెన్సీలు సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
* మృతదేహాలను స్వదేశానికి తరలించాలి
విపత్తులో మృతి చెందిన వారి మృతదేహాలను గుర్తించి, అవసరమైన అధికారిక ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి సురక్షితంగా స్వదేశానికి తరలించాలని ఎంపీ కోరారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు చేర్చే వరకు బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాసిన అనంతరం కాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయ ఉన్నతాధికారులతో డాక్టర్ కడియం కావ్య ఫోన్లో మాట్లాడారు. నేపాల్లోని తెలంగాణ బాధితుల పరిస్థితి, సహాయక చర్యలు, గల్లంతైన వారి ఆచూకీ, మృతదేహాల గుర్తింపు, స్వదేశానికి తరలింపు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆచూకీ కోసం అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగించాలని, వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులను కోరారు.
* బాధితులకు అండగా నిలవాలి
నేపాల్లో చిక్కుకున్న, విపత్తు ప్రభావానికి గురైన తెలంగాణ ప్రజలకు అవసరమైన సహాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని కడియం కావ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం, నేపాల్ అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు అండగా నిలవాలని కోరారు. గాయపడిన వారికి వైద్యం, మృతుల మృతదేహాలను స్వదేశానికి తరలించడం, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు పూర్తయ్యే వరకు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
