Mulugu DEO Siddhartha Reddy Special Needs Children
* ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించండి
-జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు ఏ సిద్ధార్థ రెడ్డి
ఆకేరు న్యూస్,ములుగు : దివ్యాంగులు, అంగవైకల్యం కలిగిన ప్రత్యేక అవసరాలు కల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తగిన నైపుణ్యాలతో వారిని తీర్చిదిద్దే బాధ్యత మాది ఉపాధ్యాయులది అంటూ ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు.
మంగళవారం గోవిందరావుపేట మండలంలోని పీఎస్ఆర్ గార్డెన్ లో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమ్మిళిత విద్య పై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, ఎం ఐ ఎస్ ఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఒకరోజు అవగాహన సదస్సును జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సిద్ధార్థ రెడ్డి ధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలని స్థానిక పాఠశాలల్లో చేర్పించాలని వారి భవిష్యత్తు బాధ్యత విద్యాశాఖ తీసుకుంటుందని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రతి మండలంలో భవిత కేంద్రాలు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఉన్నారని, మీ పిల్లలలోని లోపాలను వైకల్యాలను గుర్తించి స్థాయికి తగిన విద్యను అందిస్తారని అన్నారు. ప్రతి పిల్లవాడు అద్వితీయుడే ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా ఏదో ఒక విభాగంలో నైపుణ్యం దాగి ఉంటుందని, దానిని గుర్తించి వారిలోని ప్రతిభను ప్రోత్సహించాలని కోరారు.
అనంతరం సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ గుల్లపెల్లి సాంబయ్య మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సమగ్ర శిక్ష, అలింకో సహకారంతో ప్రతి సంవత్సరం ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించి అవసరమైన ఉపకరణాలు పిల్లలకు అందజేస్తున్నామని, ఈనెల 8వ తేదీన క్యాంప్ నిర్వహించబడుతుందని అన్నారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను విధిగా పాఠశాలలకు పంపాలని, వారికి రవాణా భత్యం అందజేయబడుతుందని విద్యార్థులలో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తారని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాస్ రెడ్డి, బి శ్యామ్ సుందర్ రెడ్డి, ఉల్లాస్ కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు, స్థానిక మండల విద్యాశాఖ అధికారి గొంది దివాకర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోవిందరావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సోమారెడ్డి లతో పాటు జిల్లాలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఆర్పీలు, మండల విద్యా వనరుల కేంద్రం లోని ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ లతో పాటుగా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
