Konda Surekha Geesugonda Police Route March
Published:
ఆకేరు న్యూస్, గీసుగొండ: మంత్రి కొండా సురేఖ తన సొంత మండలమైన గీసుగొండ మండల కేంద్రంలో పర్యటించిన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు మండల కేంద్రంలో ముందస్తుగా కవాతు (రూట్ మార్చ్) నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు మాట్లాడుతూ… మంత్రి పర్యటన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

సీనియర్ కరస్పాండెంట్
జిల్లపెళ్లి దీపిక, MA ( Journalism )
గత ఐదు సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
