ISRO GSLV F17 Launch
* సత్తా చాటిన ఇస్రో
* జీఎసఎల్వీ-ఎఫ్ 17 ప్రయోగం సక్సెస్!
ఆకేరు న్యూస్, శ్రీహరికోట :
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన జీఎసఎల్వీ-ఎఫ్ 17 రాకెట్ విజయవంతంగా ఈవోఎస్-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్య మార్గంలోకి ప్రవేశపెట్టింది. ఇది జీఎసఎల్వీ కార్యక్రమంలో 19వ ప్రయోగం కావడం విశేషం. 2,367 కిలోల బరువున్న ఈవోఎస్-05 అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహంగా పని చేయనుంది. భూభాగం, వాతావరణ పరిస్థితులు, ప్రకృతి పరిణామాలను తరచూ పరిశీలించే సామర్థ్యాన్ని ఈ ఉపగ్రహం మరింత బలోపేతం చేయనుంది. ఈవోఎస్-05 భారతదేశపు తొలి జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ ఉపగ్రహమని ఇస్రో పేర్కొంది. వాతావరణ మార్పులను గమనించడం, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణ, వ్యవసాయం, పర్యావరణ పరిశీలన వంటి పలు రంగాల్లో ఈవోఎస్ -05 ద్వారా కీలక సమాచారం అందుబాటులోకి రానుంది. భారీ ప్రాంతాలను తరచూ పరిశీలించే సామర్థ్యం ఉండడం వల్ల తుఫాన్లు, మేఘాల కదలికలు వంటి వాతావరణ వ్యవస్థలపై మరింత సమర్థవంతమైన పర్యవేక్షణకు ఇది ఉపయోగపడనుంది. ఈ విజయవంతమైన ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనా సామర్థ్యానికి మరో కీలక మైలురాయి చేరింది. దేశ భూ పరిశీలన, విపత్తుల నిర్వహణ, వాతావరణ అధ్యయనం వంటి రంగాలకు జుOS-05 కొత్త బలాన్ని అందించనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
