Veleru Women Federation
* మహిళా సంఘాలకు నూతన భవనం, సబ్సిడీ రుణాలు
ఆకేరు న్యూస్, వరంగల్ : వేలేరు మండల కేంద్రంలోని మండల సమైక్య భవనంలో మహిళా మండల సమైక్య 10వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఏపీఎం అనిత పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి మండల సమైక్య అధ్యక్షురాలు రేణుక అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో మండలంలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాల భవనాలు నిర్మించామని తెలిపారు. స్థల సేకరణ పూర్తి కాగానే మండల కేంద్రంలో ఎమ్మెల్యే సహకారంతో మండల సమైక్య నూతన భవనం నిర్మిస్తామని చెప్పారు.
మండల సమైక్యకు ప్రభుత్వం ఇప్పటికే బస్సును కూడా కేటాయించిందని, మహిళా సంఘాల సభ్యులకు వివిధ రకాల సబ్సిడీ రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో మండల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సర్పంచ్ బిల్లా యాదగిరిని మండల సమైక్య కార్యవర్గం సన్మానించింది. ఈ కార్యక్రమంలో మండల సమైక్య కార్యదర్శి రాజమ్మ, సీసీలు రమాదేవి, నాగమణి, సతీష్, ఎంఎస్ కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాల వీవో అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
