Collector Chahat Bajpai Shakti Sadan Inspection
* ఇన్మేట్స్కు ఉపాధి భరోసా
ఆకేరు న్యూస్, హన్మకొండ : హన్మకొండ నగరంలోని ‘శక్తి సదన్’ (స్వాధార్ గృహ్)ను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. సందర్శనలో భాగంగా కలెక్టర్ అక్కడ ఆశ్రయం పొందుతున్న ఇన్మేట్స్ (మహిళలు) తో నేరుగా మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రంలో నిర్వహిస్తున్న అడ్మిషన్స్ రిజిస్టర్, స్టాఫ్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ మరియు ఇతర రికార్డులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గృహంలో ఇన్మేట్స్ కోసం నిర్వహిస్తున్న కంప్యూటర్, టైలరింగ్ వంటి వృత్తి విద్యా కోర్సుల వివరాలను ఆరా తీశారు. అలాగే వారికి అందిస్తున్న తాగునీటి నాణ్యత, రోజువారీ భోజన మెనూ వివరాలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మహిళలతో ముచ్చటిస్తూ… అందరూ పట్టుదలతో చదువు పూర్తి చేసుకోవాలని సూచించారు. చదువు పూర్తయిన వారికి అర్హతను బట్టి తగిన ఉపాధి అవకాశాలు కల్పించి, వారు స్వయం సమృద్ధి సాధించేలా జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎమ్. విశ్వజా, ఈఓ ఆశాదేవి, శక్తి సదన్ సూపరింటెండెంట్ శైలజ, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
