Published:
* అద్దె ఇంట్లో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి
ఆకేరు న్యూస్, వరంగల్ : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు భీమానాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న ఆయన మృతదేహాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు నర్సంపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
