Subrahmanyam Suicide Attempt
ఆకేరు న్యూస్, వరంగల్ : మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. 40 నిద్రమాత్రలు మింగిన ఆయన శుక్రవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గుర్తించారు.
వెంటనే సుబ్రహ్మణ్యాన్ని కుటుంబ సభ్యులు వరంగల్లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. నిద్రమాత్రలు మింగిన కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
