AP Minister Savitha on Nethanna Bharosa Pension
* బ్యాంక్ స్టేట్మెంట్ అవసరం లేదు
* మంత్రి సవిత వెల్లడి
ఆకేరు న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతనంగా నేతన్న భరోసా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే చేనేత కార్మికులు ఇకపై బ్యాంకు ఖాతా స్టేట్మెంట్ సమర్పించాల్సిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.
* వేతన వివరాలతో దరఖాస్తు
మాస్టర్ వీవర్ నుంచి పొందిన వేతన వివరాలు, ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే సరిపోతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 7 నుంచి కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. బ్యాంకు స్టేట్మెంట్ తప్పనిసరి చేయడంతో చేనేత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* సీఎం ఆదేశాలతో సడలింపు
చేనేత సంఘాల ప్రతినిధులు ఈ సమస్యను మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడగా.. ఆయన ఆదేశాల మేరకు బ్యాంకు స్టేట్మెంట్ నిబంధన నుంచి సడలింపు ఇచ్చినట్లు తెలిపారు.
* 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్
50 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి నేతన్న భరోసా పెన్షన్ అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బ్యాంకు స్టేట్మెంట్ లేకపోయినా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 85 వేల మందికి పైగా నేతన్నలకు నెలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉచిత విద్యుత్‌తో పాటు ‘నేతన్నల సేవలో’ పథకం కింద ఏడాదికి రూ.25,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
