Jhansi Rajender Reddy
* అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి రాక
* ప్రవాసులతో తెలంగాణ అభివృద్ధిపై చర్చ
ఆకేరు న్యూస్, పాలకుర్తి: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, హెచ్జేఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, వెట్టా ఇండియా వ్యవస్థాపకురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డికి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.
పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని పుష్పగుచ్ఛాలు అందజేసి ఆమెకు ఆత్మీయ స్వాగతం పలికారు. అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయుల సమావేశాలతో పాటు మహిళా సాధికారత, యువతకు ఉపాధి, విద్య, ఆరోగ్యం, సామాజిక సేవా కార్యక్రమాలపై ఝాన్సీ రాజేందర్ రెడ్డి చర్చించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై ప్రవాసులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమెరికాలో ప్రవాస తెలుగు ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణను జీవితాంతం మరువలేనని అన్నారు. వారి సహకారంతో తెలంగాణలో విద్య, మహిళా సాధికారత, యువత ఉపాధి, ఆరోగ్య రంగాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. ప్రజా సేవే తన లక్ష్యమని, ప్రజల ఆశయాల సాధన కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
