Puttalamma Cheruvu Ganesh Immersion
* వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు..
* చెరువులో నీటి మట్టం పరిశీలన
అకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: వినాయక చవితి సందర్భంగా విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని పుట్టలమ్మ చెరువును డివిజన్ స్థాయి అధికారులు శుక్రవారం సాయంత్రం పరిశీలించారు.
నిమజ్జనానికి అవసరమైన నీటి లెవెల్‌ను అధికారులు తనిఖీ చేశారు. చెరువులోని పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు విగ్రహాలను సులభంగా నిమజ్జనం చేసేలా చెరువు అంచులను జేసీబీ సహాయంతో సరిచేసి, అవసరమైన మేరకు లోతు పెంచారు. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిరణ్ ప్రకాష్, ఏసీపీ భీమ్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేష్‌తో పాటు విద్యుత్ శాఖ, మున్సిపాలిటీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
