School Protection Act
* 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం
* 16 పేజీల పాఠశాల పరిరక్షణ చట్టం ముసాయిదా సిద్ధం
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : ఉపాధ్యాయుల భద్రత, గౌరవం, వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా “పాఠశాల పరిరక్షణ చట్టం” తీసుకురావాలని TRSMA రాష్ట్ర అధ్యక్షులు సాదుల మధుసూదన్ ప్రభుత్వాన్ని కోరారు. జనగామలో TRSMA జిల్లా ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలోని 60 పాఠశాలల నుంచి ఎంపికైన 120 మంది ఉత్తమ ఉపాధ్యాయులను అవార్డులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, ప్రతిభా వికాసంలో ఉపాధ్యాయుల సేవలను గుర్తించడం కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా సాదుల మధుసూదన్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని, విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దే బాధ్యతాయుతమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని అన్నారు. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ జ్ఞానం, బోధనా నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు.
* 3,500 మందికి చేరువైన Teacher App
విద్యారంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచేందుకు TRSMA ఆధ్వర్యంలో రూపొందించిన Teacher Appను ఇప్పటికే సుమారు 3,500 మంది ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు. యాప్లో సుమారు 150 కోర్సులను ఉచితంగా అందిస్తున్నామని, విద్యార్థుల్లో చెడు అలవాట్లపై అవగాహన, కౌన్సెలింగ్కు సంబంధించిన శిక్షణ కూడా అందుబాటులో ఉందని వివరించారు.
ఉపాధ్యాయుల భద్రత కోసం 16 పేజీల “పాఠశాల పరిరక్షణ చట్టం” ముసాయిదాను సిద్ధం చేసి సంబంధిత వర్గాలకు అందించినట్లు మధుసూదన్ వెల్లడించారు. వచ్చే నెలలో TRSMA ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యాయుల కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
TRSMA జిల్లా అధ్యక్షులు పి.వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను గౌరవించడం అంటే సమాజ భవిష్యత్తును నిర్మించే శక్తిని గౌరవించడమేనని అన్నారు. కార్యక్రమంలో TRSMA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.రమేష్ రావు, రాష్ట్ర కోశాధికారి పి.రాఘవేందర్ రెడ్డి, రాష్ట్ర సలహాదారు ఈ.ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రాపాక విజయ్, కోశాధికారి పి.ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఎన్.రామ్ రెడ్డి, యు.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.

Excellent coverage