Konda Couple Meeting
* పది రోజుల తర్వాత బయటకు వచ్చిన కొండా దంపతులు..
* ఆదివారం ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో భేటీ
ఆకేరు న్యూస్, హనుమకొండ : మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి దాదాపు పది రోజుల తర్వాత బహిరంగంగా కనిపించడంతో హనుమకొండ రామ్‌నగర్‌లోని వారి నివాసం వద్ద కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండా దంపతులను కలిసేందుకు ఉదయం నుంచే ముఖ్య కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
ఆదివారం వరంగల్‌లోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో కొండా దంపతులు ముఖ్య కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్న నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొండా దంపతుల తదుపరి అడుగుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా నిన్న ఢిల్లీ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ రావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కొండా దంపతులు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కొండా మురళి.. కార్యకర్తలతో సమావేశమై చర్చించిన తర్వాత తాము ఏం చేయబోతున్నామో, తమ తదుపరి కార్యాచరణ ఏమిటో వెల్లడిస్తామని తెలిపారు. దీంతో ఆదివారం జరిగే కార్యకర్తల సమావేశంలో కొండా దంపతులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కార్యకర్తలతో చర్చించిన అనంతరం కొండా దంపతులు తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
