Collector Chahat Bajpai, Hanamkonda Clay Ganapathi
* హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
* మట్టి గణపతి విగ్రహాల స్టాల్ ను సందర్శించిన కలెక్టర్
ఆకేరు న్యూస్, హన్మకొండ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. ఆదివారం హనుమకొండ మున్సిపల్ గెస్ట్ హౌస్ సమీపంలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో సహజంగా, పర్యావరణహితంగా తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాల స్టాల్ ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మట్టి వినాయక విగ్రహాల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మట్టి గణపతికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. గత పన్నెండుసంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నట్లు శివ కుమార్ కలెక్టర్ కు వివరించారు. మట్టి విగ్రహాలను చాలా ఆకర్షణీయంగా తయారు చేశారని కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ… వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించి, ప్రకృతి వనరులను కాపాడేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు.
* పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేవారికి పూర్తి సహకారం..
చెరువు మట్టితో సహజంగా తయారు చేసిన గణపతి విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండ ఉంటుందన్నారు. మట్టి విగ్రహాల నిమజ్జనం సులువుగా జరుగుతుందని, నిమజ్జనం అనంతరం లభించే మట్టిని చెట్లకు, పొలాలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మట్టి గణపతులను ప్రతిష్టించడంపట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని అన్నారు. మట్టి వినాయక విగ్రహాల ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వారికి జిల్లా యంత్రాంగం పరంగా పూర్తి సహకారం ఉంటుందన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకుందామన్నారు. పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తూ ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
