Vijay Ajith Racing Event
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తమిళనాడు ముఖ్యమంత్రి, మాజీ నటుడు విజయ్.. నటుడు, రేసర్ అజిత్ కుమార్‌ను శనివారం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సిల్వర్‌స్టోన్‌లో కలిశారు. అజిత్ పాల్గొంటున్న మిషెలిన్ లే మాన్స్ కప్ రేస్‌కు ముందు ఈ భేటీ జరిగింది. విజయ్‌తో పాటు నటి త్రిష కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
* ఏం జరిగింది?..
రేసింగ్ సర్క్యూట్ వద్ద విజయ్, అజిత్ ఒకరినొకరు పలకరించుకోవడం, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం వంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు అభిమానుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.సిల్వర్‌స్టోన్ రౌండ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముందు అజిత్.. అక్కడికి వచ్చిన విజయ్‌కు స్వాగతం పలికారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో విజయ్ అజిత్ వైపు నడుచుకుంటూ వెళ్లడం, అనంతరం ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమం కోసం నటి త్రిష కృష్ణన్ కూడా సిల్వర్‌స్టోన్‌కు చేరుకున్నారు. జీన్స్, టీ-షర్ట్, మెరూన్ రంగు జాకెట్ ధరించిన త్రిష రేసింగ్ సర్క్యూట్‌కు చేరుకుని టెంట్‌లోకి వెళ్లారు.
* రాధికా శరత్‌కుమార్‌ను కలిసిన త్రిష
సిల్వర్‌స్టోన్‌కు వెళ్లే ముందు లండన్‌లో సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో త్రిష కనిపించారు. రాధికా సోషల్ మీడియాలో త్రిషతో కలిసి దిగిన సెల్ఫీని పంచుకున్నారు. అజిత్ రేసింగ్ ఈవెంట్‌కు మద్దతుగా రాధికా లండన్‌కు వెళ్లారు. సిల్వర్‌స్టోన్ రౌండ్‌కు ముందు ఆమె అజిత్‌ను కూడా కలిశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
