Konda Murali Corporation Elections
Published:
ఆకేరు న్యూస్, వరంగల్ : కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇప్పించేలా కృషి చేస్తామని కొండా మురళి పేర్కొన్నారు.
పార్టీ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ పార్టీ బలోపేతానికి పనిచేస్తామని కొండా మురళి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వరంగల్‌లో కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
