Transformer Theft
Transformer Theft: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లు గ్రామం మర్రికుంట శివారులో గుర్తుతెలియని దుండగులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌ను చోరీ చేశారు.
స్థానిక రైతుల కథనం ప్రకారం.. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ బావుల వద్దకు రైతులు వెళ్లడం లేదు. ఇదే అదనుగా భావించిన దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్‌తో పాటు ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు తెలిపారు.
అదే ప్రాంతంలో ఉన్న కోళ్ల షెడ్లోకి కూడా చొరబడిన దుండగులు నాటు కోళ్లను సైతం ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. వరుస చోరీలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
