Hushar Pittalu OTT Release
Hushar Pittalu OTT Release : ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల థియేటర్లో విడుదలైన చిన్నచిత్రం ‘హుషార్ పిట్టలు’. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించారు.
యూత్‌ఫుల్ అంశాలతో పాటు ఎమోషనల్ అంశాలతో ఇటు యూత్‌ను, అటు ఫ్యామిలీస్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా అమోజన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన ఈ యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించాడు. ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు.
సురేష్ ఏషియన్ ఫిలిమ్ సంస్థలు ఈ చిత్రాన్ని థ్రియేటికల్ విడుదల చేశారు. థియేటర్లో బ్లాక్‌బస్టర్ విజయం అందించిన ప్రేక్షకులు ఓటీటీలో కూడా మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నానని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
